|
|
by Suryaa Desk | Mon, Nov 17, 2025, 10:25 AM
బాలీవుడ్ నటి కియారా అద్వానీ, 'గేమ్ ఛేంజర్', 'వార్2' చిత్రాల ప్లాప్ తర్వాత, యశ్ హీరోగా నటిస్తున్న కన్నడ చిత్రం 'టాక్సిక్' పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నట్లు సిని వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమె కన్నడ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది. గ్లోబల్ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని ఈ సినిమాను ఇంగ్లీషులోనూ తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ఇతర ప్రాజెక్టులను పక్కనపెట్టి, ప్రస్తుతం 'టాక్సిక్' సినిమాపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Latest News