|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 08:44 PM
ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం 'వారణాసి' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నిన్న హైదరాబాదులో జరిగిన 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం రాజమౌళి, మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈవెంట్ గురించి రాజమౌళి స్పందిస్తూ మహేశ్ బాబు అభిమానులపై ప్రశంసల వర్షం కురిపించారు. వారణాసి ఈవెంట్ కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించి వచ్చిన మహేశ్ అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 3 కిలోమీటర్లు చలిలో నడిచి వచ్చారు. మా వైపు నుంచి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా, మీ సహనం ఎక్కడా తగ్గలేదు. ఒక్క విషయం చెప్పాలి మీరు కూడా మీ అభిమాన హీరోలాగే ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు. మద్దతుగా నిలిచిన ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడికి నా కృతజ్ఞతలు" అని రాజమౌళి తన పోస్టులో పేర్కొన్నారు.అనంతరం మహేశ్ బాబు కూడా ఈవెంట్‌పై స్పందించారు. అభిమానులు చూపించిన ప్రేమ, ఎనర్జీని స్వీకరిస్తున్నాను. మా 'వారణాసి' సినిమాను ప్రపంచానికి అందిస్తున్నాం. దూరం నుంచి వచ్చి మా బృందంపై ఇంత ఆప్యాయత చూపిన నా అభిమానులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుస్తాను" అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు
Latest News