|
|
by Suryaa Desk | Sun, Nov 16, 2025, 08:41 PM
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, ఆయన తన వ్యక్తిగత నమ్మకాల గురించి చేసిన వ్యాఖ్యలు హిందూ భక్తులు, నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. "నాకు దేవుడిపైన పెద్దగా నమ్మకం లేదు. హనుమంతుడు నడిపిస్తే ఇలాగే జరుగుతుందా?" అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని విమర్శిస్తూ, రాజమౌళి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Latest News