![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 04, 2025, 03:50 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను తలదన్నేలా జిల్లాల అభివృద్ధిని చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలోని ఉమ్మడి 9 జిల్లాల్లో రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఈ 9 జిల్లాల్లో రోడ్లు, అధికార భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగిలిన ఉమ్మడి 9 జిల్లాల్లో పెద్దగా అభివృద్ది లేదన్నది తెలిసిన విషయమే. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ హైదరాబాద్ డెవలప్ అయినంతగా మిగతా జిల్లాలు కాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ను తలదన్నేలా ఉమ్మడి 9 జిల్లాల్లో రోడ్లు నిర్మించనుంది. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో రూ.6,478 కోట్లతో 373 రోడ్లను అభివృద్ధి చేయనుంది. హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో 373 రోడ్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 6,478 కోట్లతో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. హైబ్రిడ్ యాన్యూనిటీ మోడ్ విధానంలో రోడ్ల నిర్మాణ పనులు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు చివరి నాటికి టెండర్లు ఖరారు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే ఈ రోడ్లపై టోల్ గేట్లు ఉండవని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో సహా పలు జిల్లాలు, పట్టణాల్లోనూ వాహనదారుల రద్దీ పెరిగిపోయింది. ఈ క్రమంలో రోజుకు 10 వేల వాహనాలు ప్రయాణించే రోడ్లను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. హ్యామ్ విధానంలో అభివృద్ధి చేయనున్న రోడ్లపై ఇప్పటికే ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి.. రద్దీ ఎక్కువ ఉన్న రోడ్లను గుర్తించామని.. వీటిని నాలుగు వరుసలుగా నిర్మించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో 373 రోడ్లనురూ. 6,478 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టనుంది. వీటిలో అధికంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 909 కి.మీ మేర 46 రోడ్లు, నల్లగొండలో 53 రోడ్లు 699 కి.మీ మేర అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మిగిలిన జిల్లాల్లో అయితే మొత్తం నిర్మించాల్సిన కిలోమీటర్లను 14 ప్యాకేజీలుగా అధికారులు విభజించారు. ఈ మేరకు సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించి అధికారులు సీఎంకు అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు స్పష్టత రానుంది.