|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 02:34 PM
TG: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా వైష్ణవ దేవాలైన యాదాద్రి, స్వర్ణగిరి, భద్రాద్రి, చిలుకూరు బాలాజీ, బిర్లామందిర్, ధర్మపురి, కాళేశ్వరం, వేములవాడ, ఇస్కాన్ టెంపుల్స్ అన్నీ గోవింద నామ స్మరణతో మారుమ్రోగాయి. పలు ప్రాంతాల్లో గోకులాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టి శ్రీ కృష్ణుడి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. తమ ఇంటి చిన్నారిని బాలకృష్ణుడి రూపంలో అలంకరించి పండుగ జరుపుకుంటున్నారు.