|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 02:34 PM
గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదిలాబాద్(D) బోథ్ మండలకేంద్రంలో కురిసిన భారీ వర్షానికి బాలికల వసతి గృహం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బాలికలు వరదల్లో చిక్కుకున్నారు. బోథ్ MLA అనిల్ బాలికల వసతి గృహాన్ని సందర్శించి భరోసా కల్పించారు. అటు ఆదిలాబాద్‌లోని సుభాష్‌నగర్ వరదలో ఓ కుటుంబం చిక్కుకుంది. వీరిని రక్షించేందుకు NDRF సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది.