|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 03:47 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 66 శాతం ప్రజలు మీతోనే ఉంటే, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్‌కు ఆయన స్పష్టం చేశారు. పది మంది ఎమ్మెల్యేలు చెబుతున్నా స్పీకర్‌కు వినపడడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిరిసిల్లలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ సర్పంచ్‌లను సన్మానించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.