|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 12:48 PM
పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద రాంపూర్ లో ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశం జరిగింది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శ్రీలత మాట్లాడుతూ, వివిధ పాఠశాలల్లో బోధిస్తున్న వినూత్న పద్ధతులు, బెస్ట్ ప్రాక్టీస్, F.L.N మిడ్ లైన్ టెస్ట్ పై సమీక్షించారు. విద్యార్థుల ప్రగతి, విద్యా కార్యక్రమాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పాఠశాల విద్యాభివృద్ధికి సహకరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.