|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:59 PM
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో కొన్ని స్వల్ప మార్పులు చేసింది. ఫిబ్రవరి 25 నుండి ప్రారంభం కానున్న మెయిన్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన తాజా మార్పులు బోర్డు ప్రకటించింది.ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో మ్యాథమెటిక్స్ 2B, బోటనీ, పొలిటికల్ సైన్స్ పేపర్లు మార్చి 3న జరగనుండగా, మార్చి 4న నిర్వహించబడతాయి. ఇది మార్చి 3న హోలీ పండుగ జరగనున్న కారణంగా పరీక్షను ఒకరోజు వాయిదా వేయడం జరిగింది. మిగతా పరీక్షల షెడ్యూల్ యధావిధిగా కొనసాగుతుంది అని బోర్డు స్పష్టం చేసింది.
*ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్:
-ఫిబ్రవరి 25 – సెకండ్ లాంగ్వేజ్
-ఫిబ్రవరి 27 – ఇంగ్లీష్
-మార్చి 2 – మ్యాథమెటిక్స్ 1A / బోటనీ / పొలిటికల్ సైన్స్
-మార్చి 5 – మ్యాథమెటిక్స్ 1B / జూలజీ / హిస్టరీ
-మార్చి 9 – ఫిజిక్స్ / ఎకనమిక్స్
-మార్చి 12 – కెమిస్ట్రీ / కామర్స్
*ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్:
-ఫిబ్రవరి 26 – సెకండ్ లాంగ్వేజ్
-ఫిబ్రవరి 28 – ఇంగ్లీష్
-మార్చి 4 – మ్యాథమెటిక్స్ 2A / బోటనీ / పొలిటికల్ సైన్స్
-మార్చి 6 – మ్యాథమెటిక్స్ 2B / జూలజీ / హిస్టరీ
-మార్చి 10 – ఫిజిక్స్ / ఎకనమిక్స్
-మార్చి 13 – కెమిస్ట్రీ / కామర్స్
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 2 నుండి ప్రారంభమై షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 3న అధికారిక హోలీ హాలిడే ప్రకటించడంతో, ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ మార్పులను ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు గమనించాలని బోర్డు సూచించింది.