ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 08:07 PM
బాబుల్ రెడ్డి నగర్ మాజీ వార్డు మెంబర్ సోమ శ్రీనివాస్ గుప్త, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన పోరాటాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం కాటేదాన్‌లోని శ్రీ వాసవి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో, ఆయన విగ్రహానికి నివాళులర్పించి, ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిన ఆయన నిబద్ధత అందరికీ శిరోధార్యమని అన్నారు. తెలుగు ప్రజల అస్తిత్వం కోసం 58 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, ప్రాణాలను త్యాగం చేసిన ఆయన త్యాగం స్ఫూర్తిదాయకమని తెలిపారు.