|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:39 PM
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఉదయం, సాయంత్రం ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వృద్ధులు, పిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీలు, మెదక్‌లో 7.2, హనుమకొండలో 8.6, నిజామాబాద్‌లో 11.4, హైదరాబాద్‌లో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 32 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.