|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:11 PM
కామారెడ్డి జిల్లాలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు డిసెంబర్ 11వ తేదీ గురువారం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుందని, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని, ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని ఆయన పేర్కొన్నారు.