|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 04:38 PM
రెండు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పినపాక మండలం భూపాలపట్నం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కొరసా కృష్ణంరాజు, ఆయన అనుచరులతో పాటు 20 కుటుంబాల సభ్యులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికకు కృషి చేసిన దొడ్డ శ్రీనివాస్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే రేగా అభినందించారు.