|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 04:21 PM
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలంలోని బాబుపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పోతర బోయిన శ్రీధర్ వినూత్న ప్రచారంతో సందడి చేస్తున్నారు. సర్పంచ్‌గా గెలిస్తే తన వ్యక్తిగత ఆస్తులు ఒక్క రూపాయి పెరిగినా గ్రామ ప్రజలకే చెందుతాయని పేర్కొంటూ రూ.100 బాండ్ పేపర్‌పై నోటరీతో సహా హామీలు ముద్రించి ఇంటింటికీ పంచుతున్నారు. ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయబోనని, అవినీతి లేని పాలన అందిస్తానని భరోసా ఇస్తున్నారు. ఈ వినూత్న ప్రమాణ పత్రం గ్రామంలో చర్చనీయాంశమైంది.