|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 12:32 PM
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సింఫనీ పార్క్ హోమ్స్, మైత్రి మైదానం, కృషి డిఫెన్స్ కాలనీల్లో ఏర్పాటు చేసిన బహిరంగ వ్యాయామశాలను పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ గారితో కలిసి మాదిరి ప్రిథ్వీరాజ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, కాలనీల్లో ఏర్పాటుచేసిన బహిరంగ వ్యాయామశాలలు ప్రజల ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యమని, యువతతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ విజయ్ గారు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ గారు, శ్రీరాములు గారు, అమరేందర్ గారు, మాణిక్ రెడ్డి గారు, బల్వంత్ గారు, సత్తిరాజు గారు, సుధాకర్ గారు, రాజు గారు, రాములు గారు మరియు కాలనీ వాసులు, MPR యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.