|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 11:38 PM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులకు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు మరియు కంపెనీల పేర్లను పెట్టాలని ప్రతిపాదించారు.నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కొనసాగే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించబడింది. ఇప్పటికే రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు “టాటా ఇంటర్‌చేంజ్” అని పేరు వేశారు.ప్రపంచంలోనే తొలిసారిగా, అమెరికా కాన్సులేట్ జనరల్ పక్కనున్న ప్రధాన రహదారుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో “డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ” అని నామకరణం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ కూడా పంపనున్నారు.తదుపరి దశలో, మరిన్ని ప్రధాన రహదారులకు గ్లోబల్ కంపెనీల పేర్లను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక రహదారిని “గూగుల్ స్ట్రీట్”గా ప్రతిపాదించారు. అలాగే, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ వంటి పేర్లను కూడా పరిశీలనలో ఉంచారు.