|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:42 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి పీ. లక్ష్మీరాజ్యం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి పని ప్రదేశంలో అంతర్గత కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అపరెల్ పార్కులోని పంక్చుయేట్ వరల్డ్ ప్రయివేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై, కంపెనీ ఆవరణలో అంతర్గత కమిటీ పనితీరును పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రయోజనాలు, పని ప్రదేశంలో స్థితిగతులను తెలుసుకున్నారు. మేనేజ్మెంట్ సభ్యులతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి హక్కులను కాపాడాలని, ప్రోత్సాహక వాతావరణం కల్పించాలని, సరైన భద్రతా చర్యలతో పాటు మానసిక ఉల్లాసానికి చర్యలు చేపట్టాలని సూచించారు. క్రచ్ పిల్లల డేకేర్ సెంటర్ లో పిల్లలకు అందుతున్న సేవలను కూడా పరిశీలించారు.