|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 03:08 PM
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బి.యన్.రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని వనస్థలిపురం ఏరియాఆసుపత్రిలో శుక్రవారం శిశువు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కోసం ఆరోగ్య శాఖ అత్యవసరంగా ప్రత్యేక కమిటీని నియమించింది. మహేశ్వరం మెడికల్ కాలేజ్ సూపరిండెంట్ డా. నాగేందర్, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ డా. కృష్ణ ఆధ్వర్యంలో ఐదుగురు అనుభవజ్ఞులైన వైద్యులతో కూడిన విచారణ కమిటీ శనివారం అధికారికంగా ఏర్పాటైంది. కమిటీ సభ్యులు డా. సాధన రాయ్, డా. రాజేందర్, డా. రజినీకాంత్, డా. దామోదర్ రావు, డా. జయమల, ఈ కమిటీకి తక్షణ విచారణ జరిపి ఈ రోజుకే రిపోర్టు సమర్పించాలి అని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.