|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:30 PM
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. మూడు అంతర్జాతీయ విమానాలలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ రావడంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.వివరాల్లోకి వెళ్తే.. కన్నూర్-హైదరాబాద్, ఫ్రాంక్‌ఫర్ట్-హైదరాబాద్, లండన్-హైదరాబాద్ మార్గాల్లోని విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్స్ అందుకున్న వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది ఆ మూడు విమానాలు ల్యాండ్ అయిన వెంటనే తనిఖీలు చేపట్టారు.వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాలలో విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ప్రయాణికుల లగేజీ, క్యాబిన్ బ్యాగులతో పాటు కార్గో విభాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, ఈ బెదిరింపు ఈ-మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.