|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:37 AM
వనపర్తి పట్టణ ప్రభుత్వ ఎస్సీ కళాశాల బాలుర వసతిగృహం (బి) లో శనివారం డా. బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంక్షేమ అధికారి పసుల సత్యనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో సిబ్బంది, విద్యార్థులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా, అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి విద్యార్థి తన జీవితానికి వ్యక్తిగత రాజ్యాంగం సిద్ధం చేసుకొని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సంక్షేమ అధికారి పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత దేశ నిర్మాణానికి చేసిన కృషి, సమానత్వం, న్యాయం, విద్య, హక్కుల కోసం ఆయన పోరాటాన్ని విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి లక్ష్మి, విద్యార్థులు ఆనంద్, అరవింద్, మహేష్, అనిల్ కుమార్ తదితరులు అంబేద్కర్ జీవిత చరిత్రలోని ఆసక్తికర అంశాలను వివరించారు. సిబ్బంది నాగమ్మ, సుజాత, ఎల్లయ్యతో పాటు మిగతా విద్యార్థులు పాల్గొన్నారు.