|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 02:13 PM
ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పాయల్ శంకర్ ప్రజలను మోసం చేస్తున్నారని, పాయల్ శంకర్ సీఎంకు భజన చేస్తున్నారని జోగురామన్న విమర్శించారు. దీనికి ప్రతిస్పందిస్తూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జోగురామన్న ఏం చేశారో చెప్పాలని, ఆయన అక్రమాల బండారం బయటపెడతానని పాయల్ శంకర్ హెచ్చరించారు. అభివృద్ధి కోసం సీఎంను ఎన్నిసార్లు అయినా కలుస్తానని తెలిపారు. జోగురామన్న వ్యక్తిగత దూషణలకు పాల్పడితే సహించేది లేదని, తానే పాయల్ శంకర్ కు రాజకీయ బిక్ష వేశానని అన్నారు. దీనిపై పాయల్ శంకర్ స్పందిస్తూ, ప్రజలందరికీ అంతా తెలుసని, జోగురామన్న గురించి మాట్లాడి సమయం వృధా చేయనని తెలిపారు. వీరిద్దరి మధ్య రాజకీయ వేడి ఎక్కడి వరకు చేరుతుందోనని పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు.