|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:21 PM
దేవరకొండ డివిజన్లోని 9 మండలాలలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ర్యాండమైజేషన్ బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో జరిగింది. జిల్లా సాధారణ పరిశీలకురాలు కోర్రా లక్ష్మీ, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 2206 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం 2647 మంది పిఓలు, 2959 మంది ఓపిఓలను నియమించారు. వీరి రెండవ విడత ర్యాండమైజేషన్ కూడా పూర్తయింది.