|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 04:32 PM
తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, నగరం నుంచి గ్రామాలకు తిరుగు ప్రయాణం మొదలైంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వేలాది మంది ఓటర్లు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ నుండి తగినన్ని ప్రత్యేక బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో ఏర్పాట్లు చేయలేదంటూ ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు రాకపోవడంతో ప్రయాణికుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోగా, కొన్ని చోట్ల తొక్కిసలాటకు దారితీసింది. తొర్రూరు, మహబూబాబాద్, హన్మకొండ దిశగా భారీ రద్దీ నెలకొంది.