|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 10:45 AM
సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 4న అదృశ్యమైన 13ఏళ్ల బాలికను ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు సికింద్రాబాద్‌లో గుర్తించారు. బస్టాండ్ పరిధిలో సంచరిస్తున్న ఆమెను గుర్తించిన పోలీసులు. మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు యువకులను అక్కడే అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు 19ఏళ్లవారు, మరో ఇద్దరు 17ఏళ్లవారు. కేసు పోక్సో చట్టం కింద నమోదు చేసి, పెద్దలను రిమాండ్‌కు పంపగా, మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు.