|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 02:47 PM
కడప జిల్లా మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుమారి దుర్మరణం చెందారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుమారి లారీ టైర్ల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త విశ్వనాథ్, ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు.