|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:14 PM
చాంద్రాయణగుట్టలో అనధికారికంగా దొంగిలించిన ప్రమాదకర అనస్థీషియా ఔషధం అట్రేనియమ్ 25 mg ఇంజెక్షన్ తీసుకోవడంతో ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతి చెందిన కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఔషధ దొంగతనం, అక్రమ విక్రయం, నిర్లక్ష్యం, అనుభవం లేకుండా మత్తు ఇంజెక్షన్ల వాడకం వంటి కారణాలతో ఈ అరెస్టులు జరిగాయి. మృతులు జంగీర్ ఖాన్ (25), సయ్యద్ ఇర్ఫాన్ (29) లకు 'టెర్మెన్' అనే ఇంజెక్షన్ అలవాటు ఉందని, అదే తరహా మందు కోసం ప్రయత్నిస్తూ అట్రేనియమ్ వంటి అధిక ప్రమాదకర అనస్థీషియాను వాడటం వారి ప్రాణాలను తీసిందని పోలీసులు తెలిపారు.