|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:33 PM
దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనికి తోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా పసిడి ధరలు అధిక స్థాయిలో నిలకడగా ఉండటానికి కారణంగా భావిస్తున్నారు.సోమవారం (డిసెంబర్ 8) ఉదయం మార్కెట్ ధర ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,30,140 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,19,300గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ. 1,30,290 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1,19,440 వద్ద ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.మరోవైపు వెండి ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. నిన్నటితో పోలిస్తే కేజీ వెండిపై రూ.100 పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడలలో కేజీ వెండి ధర రూ. 1,95,800కి చేరింది.