|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 04:15 PM
రైల్వేశాఖ వెయిటింగ్ టికెట్లపై కొత్త నియమాలను విడుదల చేసింది. ఏ క్లాస్‌లోనూ మొత్తం సీట్లలో 25 శాతానికి మించి వెయిటింగ్ టికెట్లు ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఒక కోచ్‌లో 100 సీట్లు ఉంటే, వెయిటింగ్ లిస్ట్ 25 సీట్లకు మాత్రమే పరిమితం చేయాలి. దీనివల్ల వెయిటింగ్ లిస్ట్ తగ్గడంతో పాటు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. సగటున 21% మంది టికెట్లు రద్దు చేసుకుంటున్నారని, 4-5% మంది రైలు ఎక్కడం లేదని రైల్వేశాఖ తెలిపింది.