|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:38 PM
TG: కేసీఆర్ బయటకు రాకపోవడానికి కారణం బీఆర్ఎస్పై ప్రజల వ్యతిరేకతే అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. గాంధీ భవన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ, తొలి విడతలో 90% సర్పంచ్‌లు కాంగ్రెస్‌వారే గెలిచారని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే ప్రజలు తమపై నమ్మకం చూపించారని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ దోపిడీ, అవినీతితో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడంతోనే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు.