|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 04:20 PM
పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ ప్రక్రియలో బీఎల్‌ఓలకు బెదిరింపులు వస్తున్నాయని, దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. బీఎల్‌ఓల భద్రతకు ఆదేశాలు జారీ చేస్తామని, ఒత్తిడికి గురైతే వారి స్థానంలో వేరేవారిని నియమించాలని రాష్ట్రాలకు సూచించింది. SIRలో అవాంతరాలు ఏర్పడితే పోలీసుల సహకారం తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది.