|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 01:52 PM
సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్ వద్ద జరుగుతున్న అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ కోసం యువ క్రికెటర్లు భారీగా తరలి వచ్చారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. తమ పిల్లలను ఉదయం నుంచి ఎండలో నిలబెట్టి, గ్రౌండ్‌లోకి అనుమతించడం లేదంటూ యువ క్రికెటర్ల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సెలక్షన్ ప్రక్రియపై కమిటీ సరైన సమాధానం చెప్పకపోవడంతో, వారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.