|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 02:52 PM
మేడ్చల్ జిల్లా నాగారంలో ఆగి ఉన్న లారీని డివైన్ గ్రేస్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సులో కేవలం ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారని, వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత నెలలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్లో రావుస్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులో మంటలు చెలరేగిన ఘటనను పోలీసులు గుర్తు చేశారు.