|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:40 PM
కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నాలుగు కొత్త కార్మిక చట్టాలు (లేబర్ కోడ్స్) ఉద్యోగుల వేతన స్వరూపాన్ని పూర్తిగా మార్చనున్నాయి. దేశంలోని 29 పాత కార్మిక చట్టాల స్థానంలో అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం వల్ల నెలనెలా చేతికొచ్చే జీతం (టేక్ హోమ్ శాలరీ) తగ్గనుండగా, పదవీ విరమణ ప్రయోజనాలు గణనీయంగా పెరగనున్నాయి. నవంబర్ 21 నుంచే లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. కొత్త కార్మిక చట్టాల ప్రకారం, ఉద్యోగి మొత్తం వేతనంలో (CTC) అలవెన్సులు 50 శాతానికి మించకూడదు. అంటే, బేసిక్ పే (మూల వేతనం), కరవు భత్యం (డీఏ) వంటివి కలిపి కనీసం 50 శాతం ఉండాలి. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ పేను తక్కువగా చూపి, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులను ఎక్కువగా ఇస్తున్నాయి. కొత్త నిబంధనతో ఈ విధానానికి తెరపడనుంది.