|
|
by Suryaa Desk | Wed, Dec 10, 2025, 07:12 PM
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు. బుధవారం మొదటి విడత పోలింగ్ జరిగే మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. శిక్షణలో చెప్పిన నిబంధనలు పాటిస్తూ, కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని, ఎక్కడ అలసత్వం లేదా వివాదాలు జరగకుండా సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు.