|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 04:25 PM
TG: కేసీఆర్ దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ ప్రకటన వచ్చిందని ఎమ్మెల్యే హరీశ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న హరీశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అన్నారు. కేసీఆర్ అంటే పోరాటం.. కేసీఆర్ అంటే త్యాగం అని, రేవంత్ అంటే వెన్నుపోటు.. రేవంత్ అంటే ద్రోహం అని ధ్వజమెత్తారు.