తాళ్లపల్లి గ్రామంలో అంకిని యశోద భారీ మెజారిటీతో సర్పంచ్‌గా చరిత్ర సృష్టి
Fri, Dec 12, 2025, 11:03 AM
|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 07:15 PM
ఆహారభద్రత కార్డులోని సభ్యులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి అని పౌర సరఫరాల శాఖ ఆదేశించింది. కొత్త రేషన్‌కార్డుల మంజూరు, పాత కార్డులో కొత్త సభ్యుల చేర్పు ప్రక్రియ కొనసాగుతున్నందున, కొత్త సభ్యులు కూడా ఈ-కేవైసీ చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 85% ఈ-కేవైసీ పూర్తయింది. ఈ నెల 20లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని యూనిట్లకు రేషన్ కోటాను నిలిపివేస్తామని హెచ్చరించారు.