|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:33 PM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మద్యం పార్టీపై స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు.వివరాల్లోకి వెళితే... మొయినాబాద్‌లోని ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు పార్థసారథి తన పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్, మాధురి దంపతులు కూడా హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన పోలీసులు, అక్కడ అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.ఈ దాడుల్లో 7 మద్యం బాటిళ్లను, హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో మొత్తం 29 మంది పాల్గొన్నట్లు సమాచారం. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.