|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:40 PM
తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పునుగు పిల్లి కరీంనగర్ పట్టణంలో ప్రత్యక్షమైంది. ఆదివారం ఉదయం హిందూపురి కాలనీలోని నారెడ్డి రంగారెడ్డి ఇంట్లో ఈ పునుగు పిల్లి కనిపించడంతో, కుటుంబ సభ్యులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని పునుగు పిల్లిని క్షేమంగా పట్టుకున్నారు. అనంతరం దానిని స్థానిక డీర్‌పార్క్‌కు తరలించారు. పునుగు పిల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, డీర్ పార్క్‌లో దానికి వైద్యం చేయిస్తామని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి నర్సింగరావు తెలిపారు. అది పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి అటవీ ప్రాంతంలో వదలిపెడతామని చెప్పారు.