|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:37 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన నగరానికి విచ్చేస్తున్నారు. ఈ హై-ప్రొఫైల్ కార్యక్రమానికి ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది.షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ గాంధీ ఈరోజు సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి బయల్దేరి, రాత్రి 7:15 గంటలకు మైదానానికి వస్తారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందులో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొననున్నారు.