|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 03:40 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత సమావేశంలో, ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను ఆర్ అండ్ బీ, ఎన్ హెచ్, పోలీస్, ట్రాన్స్పోర్ట్ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాలని సూచించారు. ప్రమాదాలకు కారణమవుతున్న యూటర్న్ లను మూసివేయాలని, అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను చెక్ చేయడానికి స్పీడ్ గన్స్ కొనుగోలు చేయాలని, రోడ్డుకు సమీపంలో ఉన్న పాత బావులను పూడ్చివేయాలని, రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించాలని, రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.