|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:37 AM
తెలంగాణ రాష్ట్రం చలి గుప్పిట్లో చిక్కుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 5 గంటల నుంచే చలి ప్రభావం మొదలై ఉదయం 8 గంటలు దాటినా కొనసాగుతుండటంతో జనజీవనంపై ప్రభావం పడుతోంది.రాజధాని హైదరాబాద్‌లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఏడేళ్ల తర్వాత నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం శేరిలింగంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో 6.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మౌలాలిలో 7.1, రాజేంద్రనగర్‌లో 7.7, గచ్చిబౌలిలో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.