|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:29 PM
రాష్ట్రములో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని 193 మండలాల పరిధిలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పలుచోట్ల ఓటర్ల సందడి నెలకొంది.ఈ దశలో మొత్తం 3,911 సర్పంచ్, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పదవుల కోసం 12,782 మంది సర్పంచి అభ్యర్థులు, 71,071 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 38,337 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 57.22 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ ముగిసిన వెంటనే, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం, గెలుపొందిన వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉప సర్పంచి ఎన్నికను కూడా పూర్తి చేస్తారు.