|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:34 PM
ఏఐ రంగంలో భారత్ తన సత్తా చాటుతోంది. ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వమున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేసిన 'గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్' ర్యాంకింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగం, నైపుణ్యం కలిగిన మానవ వనరులే ఈ ఘనతకు కారణమని నివేదిక పేర్కొంది.ఈ జాబితాలో 78.6 స్కోర్‌తో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 36.95 స్కోర్‌తో చైనా రెండో స్థానంలో నిలిచింది. భారత్ 21.59 స్కోర్‌తో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూకే, సింగపూర్, జపాన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలను భారత్ అధిగమించడం విశేషం.