|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:09 PM
వికారాబాద్ జిల్లా చోడాపూర్ మండల కేంద్రంలో ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివసిస్తున్న కర్రె రత్నయ్య(32), కవిత దంపతులు. రత్నయ్య పొలం పనులు చేస్తుండగా, ప్రైవేట్ కంపెనీలో కూలీ పని చేస్తూ, అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో వివేహతర సంబంధం పెట్టుకున్న కవిత. ఈ విషయం తెలిసి, పెళ్ళీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారని, ఇలాంటి పనులు మానేయాలని కవితను పలుమార్లు హెచ్చరించిన భర్త రత్నయ్య. దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా మారుతున్నాడని, ప్రియుడితో కలిసి భర్తను హత్యచేయాలని నిర్ణయించిన కవిత. ఎప్పటిలాగే పొలం పనుల కోసం వెళ్తుండగా, వెనుక నుండి ట్రాక్టర్‌తో ఢీకొట్టి రత్నయ్యను హతమార్చిన రామకృష్ణ . తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కవిత పోలీసులకు తెలపగా.. కవిత మీద అనుమానం ఉందని ఫిర్యాదు చేసిన రత్నయ్య తమ్ముడు దేవయ్య .పోలీసులు తమదైన శైలిలో విచారించగా, ప్రియుడితో కలిసి తానే హత్య చేయించమని ఒప్పుకున్న భార్య. భార్య కవిత, ప్రియుడు రామకృష్ణలను అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించిన పోలీసులు