|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:40 PM
వికారాబాద్ జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. ట్రాక్టర్‌తో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ, పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన రత్నయ్య, కవిత దంపతులు. కవితకు అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త రత్నయ్యకు తెలియడంతో ఆయన భార్యను మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న రత్నయ్యను అడ్డు తొలగించుకోవాలని కవిత, రామకృష్ణ పథకం వేశారు.ప్రణాళిక ప్రకారం, ఉదయం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న రత్నయ్యను రామకృష్ణ ట్రాక్టర్‌తో వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రత్నయ్య అక్కడికక్కడే మరణించాడు. మొదట ఇది ప్రమాదంగానే అందరూ భావించారు. అయితే రత్నయ్య సోదరుడు తన అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది.క్షణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులకు కవిత, రామకృష్ణల అక్రమ సంబంధం గురించి తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, తామే హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, రత్నయ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.