|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 12:47 PM
తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన ఫలితం వెలువడింది. సర్పంచి పదవి కోసం ఒకే కుటుంబం నుంచి తండ్రీకొడుకులు పోటీ పడగా, గ్రామస్థులు అనుభవానికే పట్టం కట్టారు. కుమారుడిపై తండ్రి ఘన విజయం సాధించారు.వివరాల్లోకి వెళ్తే.. రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి మానెగల్ల రామకిష్టయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్ నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగింది. అయితే, ఓటర్లు మాత్రం తండ్రి రామకిష్టయ్య వైపే మొగ్గు చూపారు.గ్రామంలో మొత్తం 1,985 ఓట్లు ఉండగా, రామకిష్టయ్యకు 684 ఓట్లు పోలయ్యాయి. ఆయన కుమారుడు వెంకటేశ్‌కు 585 ఓట్లు దక్కాయి. దీంతో 99 ఓట్ల మెజారిటీతో రామకిష్టయ్య గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.