|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 02:54 PM
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా దర్యాప్తు తీరుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.ఈడీ అధికారులు ఏ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. కేవలం బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఇచ్చిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్ ఇచ్చిన సమన్ల ఆదేశాల మేరకు కాకుండా, ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే కేసు విచారణ జరగాలని పేర్కొంది.అయితే, ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ఈడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దర్యాప్తును నిలిపివేయలేదని స్పష్టం చేసింది.