|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 11:16 AM
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణ నుంచి ఏపీలోని కాకినాడ, నర్సాపూర్, తిరుపతి వంటి ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. వికారాబాద్-కాకినాడ, సికింద్రాబాద్-కాకినాడ, తిరుపతి-వికారాబాద్, నర్సాపూర్-వికారాబాద్, లింగంపల్లి-నర్సాపూర్, లింగంపల్లి-కాకినాడ మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లకు బుకింగ్ ప్రారంభమైందని, ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.