|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:16 PM
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను కోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో, బీజేపీ చేసిన అరాచకాలపై నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో రహదారిపై బైటయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా, నేషనల్ హెరాల్డ్ కేసులో నిజం గెలిచిందని, కుట్ర ఓడిపోయిందని, రాజకీయ కక్షతో ఈడీని వాడిన బీజేపీకి ఇది గుణపాఠమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్దోషులని, ప్రజాస్వామ్యం గెలిచిందని, బీజేపీ అరాచకాలు ఓడిపోయాయని, ప్రజాస్వామ్య సంస్థల దుర్వినియోగాన్ని ఖండిస్తున్నామని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పేర్కొన్నారు.