|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:27 PM
TG: భద్రాచలం పట్టణంలో పట్టపగలే ఓ వ్యక్తిని కొందరు యువకులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చర్ల రోడ్ లోని వైన్స్ షాప్స్ సమీపంలో కొందరు యువకులు ప్రధాన రహదారిపై, ప్రజలు చూస్తుండగా రవి వర్మ అనే వ్యక్తి పై కత్తులతో పొడిచి చంపారు. దాడి చేసిన అనంతరం సంఘటన స్థలం నుంచి ధైర్యంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. అక్కడే ఉన్న కొందరు రవి వర్మను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.